చెన్నై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన కీలక పోరులో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. జింబాబ్వేపై 72 రన్స్ తేడాతో గెలుపొందింది. అందరి అంచనాలు తారుమారు చేస్తూ భారీ స్కోర్ ను సాధించింది. తొలుత మైదానంలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 256 పరుగులు చేసింది నాలుగు వికెట్లు కోల్పోయి. చెపాక్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలింగ్ , బ్యాటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సూర్య భాయ్. ఓపెనర్స్ పనితీరు బాగుందన్నాడు. తొలి బంతి నుంచే అటాక్ చేయడం మొదలు పెట్టాలన్నది తమ ప్లాన్ అని. అందుకు అనుగుణంగానే ప్రతి ఒక్కరు తమ శక్తి వంచన లేకుండా ఆడారంటూ పేర్కొన్నాడు.
ఎలాగైనా సరే కప్పు కైవసం చేసుకోవాలనేది తమ ప్లాన్ అని అన్నాడు. ప్రత్యర్థి ఎవరు అనేది పట్టించు కోవద్దంటూ ఇప్పటికే మేనేజ్మెంట్ స్పష్టం చేసిందని, ఎవరి స్థాయిలో ఆడాలని, ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదని సూచించడం జరిగిందన్నాడు సూర్య కుమార్ యాదవ్. ఒక రోజు ముందు ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన బలా బలాలు, బలహీనతల గురించి వీడియోల ద్వారా వీక్షించడం , అంతే కాకుండా మైదానంలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి కూడా తాము ప్లాన్ చేశామన్నాడు. అది వర్కవుట్ అయ్యిందన్నాడు .



















