పాకిస్తాన్ : శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి భారత జట్టు చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది పాకిస్తాన్ క్రికెట్ టీం. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ 77 రన్స్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆటగాళ్లు తేలి పోయారు. భారత జట్టు బౌలర్ల దెబ్బకు వికెట్లను పారేసుకున్నారు. దీంతో 61 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉండగా టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడి పోవడం ఇది వరుసగా ఎనిమిదోసారి కావడం విశేషం. దీంతో పాకిస్తాన్ ఘోరంగా పరాజయం పాలు కావడం పట్ల సీరియస్ గా స్పందించాడు పాకిస్తాన్ మాజీ స్టార్ పేసర్ షోయబ్ అఖ్తర్.
దీనికంతటికి ప్రధాన కారకుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహిసిన్ నఖ్వీ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడాడు. తను పూర్తిగా అసమర్థుడు, నిరక్షరాస్యుడని, క్రికెట్ లో తనకు ఏమీ తెలియదంటూ ద్వజమెత్తాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు కిరీటాన్ని కాపాడు కోవడానికి ఇక్కడకు వచ్చిందని అన్నాడు. తను కన్నీటి పర్యంతం అయ్యాడు . తను బాబర్ ఆజమ్ ను కూడా వదిలి పెట్టలేదు. తను ఎందుకు జట్టులో కొనసాగుతున్నాడని ప్రశ్నించాడు. తమ జట్టు ఆటగాళ్లలో ఒత్తిడిని తట్టుకునే స్థితిలో లేరన్నాడు అఖ్తర్.



















