ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ మనోహర్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆట తీరుపై స్పందించారు. శనివారం సన్నీ స్టార్ టీవీతో మాట్లాడారు. తను ఇంకా ఇబ్బందుల్లో ఉన్నాడని, సరిగ్గా బౌలర్లను ఎదుర్కోలేక పోతున్నాడని పేర్కొన్నారు. సంజు సామ్సన్ ఔట్ అయిన విధానం ఇందుకు భిన్నంగా ఉందన్నారు. గతంలో కూడా తను అనవసరమైన షాట్స్ ఆడేందుకు ప్రయత్నం చేసి వికెట్ ను పారేసుకుంటున్నాడని తెలిపాడు. స్పష్టంగా అది యాజమాన్యాన్ని కొంచెం భయపెట్టే విషయం అన్నారు. ఎందుకంటే ఆదివారం రోజు కీలకమైన మ్యాచ్ జరగనుందని చెప్పాడు. యావత్ క్రికెట్ లోకం శ్రీలంకలో జరిగే కీలకమైన , అత్యంత ఉత్కంఠ భరితమైన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోందన్నాడు.
ఈ తరుణంలో సంజూ శాంసన్ ఆట తీరు జట్టు మేనేజ్మెంట్ ను తీవ్రంగా భయపెడుతోందన్నాడు సునీల్ మనోహర్ గవాస్కర్. అభిషేక్ శర్మ ఫిట్‌గా లేకపోతే, సామ్సన్ ఆడే అవకాశం ఉందన్నాడు. ఇలా స్థిమితంగా ఆడక పోతే జట్టు పై తీవ్ర ప్రభావం పడనుందని హెచ్చరించారు. ఇప్పటికే తను న్యూజిలాండ్ టి20 సీరీస్ లో తీవ్ర నిరాశ పరిచాడని తెలిపాడు. తను 5 ఇన్నింగ్స్ లు ఆడి 50 రన్స్ మాత్రమే చేశాడని , అందుకే తనను ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో జట్టు హెడ్ కోచ్ గంభీర్ తీసుకోలేదన్నాడు. విచిత్రం ఏమిటంటే స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురవడంతో శాంసన్ కు నమీబియాతో ఆడే ఛాన్స్ లభించిందన్నాడు గవాస్కర్. ఇకనైనా సంజూ శాంసన్ తన ఆటతీరు మార్చుకోవాలని లేక పోతే కష్టమేనని హెచ్చరించాడు.



















