న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ (విబి జి రామ్ జి) పథకం కింద గ్రామీణ కార్మికులకు అందించే వేతనాలు, పథకం అమలుకు సంబంధించిన పలు అంశాలపై తిరుపతి ఎంపీ పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సమాధానం ఇచ్చారు.
విబి జి రామ్ జి చట్టం 2025లోని సెక్షన్ 10 ప్రకారం, ఈ పథకానికి సంబంధించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించే అధికారం కలిగి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధంగా ప్రకటించే వేతనాలు సంబంధిత రాష్ట్రాలు, జిల్లాల్లో అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) ఇస్తున్న వేతనాల కంటే తక్కువగా ఉండ కూడదని చట్టంలోనే స్పష్టంగా పేర్కొనబడిందన్నారు. పూర్తి పారదర్శకతతో ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు కేంద్ర మంత్రి.

















