అనంతపురం జిల్లా : తన నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు సాగు నీటి కోసం ఇబ్బంది పడ కూడదని స్పష్టం చేశారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. తన క్యాంపు కార్యాలయంలో హెచ్.ఎల్.సి (HLC) అధికారులు, వాటర్ యూజర్స్ అసోసియేషన్ (WUA) అధ్యక్షులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు బండారు శ్రావణి శ్రీ. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ నీటి సమస్యలపై చర్చించారు. తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పుట్లూరు మండలంలోని కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి, బొప్పేపల్లి చెరువులకు నీరు విడుదల చేసే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మిగిలిన డిస్ట్రిబ్యూటర్ల పరిధిలోని రైతుల వాస్తవ పరిస్థితులను వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వివరించి, పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
గ్రామాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సకాలంలో నీటి సరఫరా జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని బండారు శ్రావణి శ్రీ ఆదేశించారు. బుక్కరాయ సముద్రం చెరువు, బి. పప్పూరు, చిన్న చెరువు ,దుర్గం చెరువుకు సంబంధించిన అంచనాలు (ఎస్టిమేట్స్), చామలూరు గ్రామంలో చెక్‌డ్యామ్ పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడంపై వివరణ కోరారు. అలాగే గూగుడు చెరువు నుంచి నడింపల్లి గ్రామానికి నీరు విడుదల చేయడంతో పాటు సలకం చెరువుకు నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) అంశం, పశ్చిమ నరసాపురంలోని దేవుల చెరువుకు నీరు విడుదల చేయడం, శింగనమల చెరువులో లోకలైజేషన్ చేపట్టి నీటి విడుదలకు అవసరమైన స్లూయిసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
(హెలో)

















