చిత్తూరు జిల్లా : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27 పై స్పందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉందన్నారు. తమ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, తీసుకు వచ్చిన సంస్కరణలకు ఊతం ఇచ్చేలా ఉందని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఏఐ సహా వివిధ టెక్నాలజీలు, నెక్స్ట్ లెవల్ ఆఫ్ రిఫార్మ్స్ కు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రెన్యువబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ నేషన్ దిశగా బడ్జెట్ ఉందని చెప్పారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారని , దీనిని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా బడ్జెట్ ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఉపయోగం ఉందన్నారు.తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హైస్పీడ్ కారిడార్లల్లో కవర్ అవుతాయని అన్నారు. బెంగుళూరు- చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ వల్ల పలమనేరు, చిత్తూరు, తదితర ప్రాంతాలకు మేలు జరుగుతుందన్నారు.

















