అమరావతి : ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విడదీయలేని బంధంగా పెనవేసుకు పోయిందన్నారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన కీలక సమావేశంలో ప్రధానంగా సోషల్ మీడియా, పెడు ధోరణలపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలకు సంబంధించి జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు నారా లోకేష్. ఈ సందర్బంగా కీలక సూచనలు , అభిప్రాయాలను వారి వద్ద నుంచి స్వీకరించారు. ప్రధానంగా విద్యార్థులు, మహిళలు, బాలికలు, యువతులు, పెద్దలు సైతం దీని బారిన పడుతున్నారని విలువైన కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు నారా లోకేష్. ఏపీ సర్కార్ పూర్తిగా కృత నిశ్చయంంతో ఉందన్నారు. సోషల్ మీడియా పేరుతో చిల్లర మల్లర వేషాలు వేయడం, కావాలని అబద్దాలను ప్రచారం కూడా తప్పేనని పేర్కొన్నారు నారా లోకేష్. ఇదిలా ఉండగా మైనర్లను (నిర్ణీత వయస్సు) సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయమై విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్‌లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు నారా లోకేస్. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టే హేబిచ్యువల్ అఫెండర్స్ పై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు నారా లోకేష్.
















