హైదరాబాద్ : ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌పై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం చర్చకు దారి తీశాయి. ఈ సందర్బంగా పిల్లలు అమీన్, రహీమా సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు. రెహమాన్ సంగీతాన్ని ప్రధాని మోదీ ప్రశంసించిన పాత వీడియోను అమీన్ షేర్ చేశారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి, రెహమాన్‌లు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్నారని మోదీ కొనియాడారు. ఇతరులను నిందించడానికి సమయం కేటాయించే వారు, ప్రేమను బోధించే గ్రంథాలను చదవలేక పోతున్నారని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తను ముస్లిం కాబట్టే తనకు అవకాశాలు రాకుండా పోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏఆర్ రెహమాన్. ఓ ఛానల్ తో జరిగిన చిట్ చాట్ సందర్బంగా తన మనసులోని భావాలను పంచుకున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా భారత దేశంలో మతపరమైన అనిశ్చితి వాతావరణం నెలకొనడం వల్ల తను ముస్లిం అయినందు వల్ల ఇబ్బందులు పడ్డానని పేర్కొన్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ లో తాను సంగీతం అందించిన ఛావా మూవీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇది పూర్తిగా విద్వేషంతో కూడిన చిత్రం అని, అయినా తాను సంగీతం అందించానని తెలిపాడు. అయితే తమ తండ్రి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని తన కూతుళ్లు వాపోయారు.

















