హైదరాబాద్ : హైదరారాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీవీ ఛానల్ తో పాటు వివిధ సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్లలో మంత్రి, ఐఏఎస్ అధికారి మధ్య లింకు ఉందంటూ ప్రసారం చేయడంపై సీరియస్ గా స్పందించారు . ఇది మంచి పద్దతి కాదన్నారు.
మహిళా అధికారిపై విమర్శలు చేయడం వల్ల కేసు నమోదు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై అవమానకారంగా వార్తలు వేయడం దారుణమన్నారు. ప్రముఖ టీవీ ఛానెల్స్ రిపోర్టర్లను అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా మహిళా అధికారుల పై ఆరోపణలు చేయడం క్రూరత్వం అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు.
అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని , మహిళల పై విమర్శలు చేస్తే కుటుంబాలు ఇబ్బందులు పడుతారన్న సోయి లేకుండా ప్రవర్తిస్తే, వార్తలు ప్రసారం చేస్తే ఎలా అని ప్రశ్నించారు సీపీ సజ్జనార్. ఇలాంటి విషయాల పై మాట్లాడాలంటే బాధ అనిపిస్తుందని అన్నారు. సృష్టికి మూలం అమ్మ అని, అమ్మ అంటే స్త్రీ అని, అమ్మను విమర్శ చేస్తే స్ట్రష్టిని విమర్శ చేసినట్లేనని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు సీపీ సజ్జనార్. చట్టం తనపని తాను చేసుకుని వెళుతుందని స్పష్టం చేశారు. బ్యాంకాక్ పేరుతో అర్థరాత్రి పారి పోతున్నారని , మరి తప్పు చేయక పోతే అలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.















