హైదరాబాద్ : రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ సీఎంగా 9 డీఏలు పెండింగ్ లో పెట్టారని అన్నారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్ రావు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నాడని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజల పాలిట సర్కార్ శాపంగా మారిందని అన్నారు. ఉద్యోగులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారని వాపోయారు.సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యోగులకు చాక్ లెట్ ఇచ్చారని ,ఇంకా ఐదు డీఎలు పెండింగ్ లో ఉంచారని పేర్కొన్నారు.
ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వడం లేదని అన్నారు. కోటి రూపాయలు భీమా ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంతులేని కథ సినిమాలో జయప్రద పాత్రను సీఎం రేవంత్ రెడ్డి పోషిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు హరీశ్ రావు. రైతులకు పంట బోనస్ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.
సీఎం హోదా అన్న సోయి లేకుండా రేవంత్ రెడ్డి జల్సాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. హెలికాప్టర్లు, ఫుట్ బాల్ మ్యాచులు, మెస్సి కోసం, అందాల పోటీల కోసం ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తన్నీరు హరీశ్ రావు. ప్రజలను రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని మండిపడ్డారు తీవ్ర స్థాయిలో.
ఉద్యోగులను విభజించి పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.















