హైదరాబాద్ : తాను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వనని శాసన సభ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తాను కోపంతో చెప్పినా, బాధతో చెప్పినా, అర్థం చేసుకుని చెప్పినా, నా ఆలోచనలు ఒక్కటే.. మనం ఈ తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి. చిన్న వయసులోనే దేవుడు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ, దేవుడు నాకు ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఇది ఆశావాదం విషయం కాదు. ఇది ఒక గొప్ప బాధ్యత. నేను దీనిని దేవుడు ఇచ్చిన బాధ్యతగా భావిస్తున్నాను. నేను ఈ కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు హాని కలిగించే చిన్న తప్పు కూడా చేయనని ప్రకటించారు. దీనిని నా బాధ్యతగా భావించి తెలంగాణ ప్రజలకు చెబుతున్నానని అన్నారు. ఇది దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్న విషయం. నేను ఈ కుర్చీలో కూర్చున్నంత కాలం తెలంగాణ హక్కులకు భంగం కలగనివ్వనని అని స్పష్టం చేశారు.
జలాలు – వాస్తవాలు’ అనే అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. కృష్ణా జలాలు, రాష్ట్రాల మధ్య కేటాయింపులు, జల వివాదాలు, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రతిపక్షాల విమర్శలు వంటి అన్ని అంశాలపై స్పష్టమైన సమగ్ర సమాచారాన్ని సభకు తెలియజేశారు. ప్రతి విషయంలోనూ సంబంధిత పత్రాలను సభ ముందు ఉంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టుల వివరాలను తెలిపారు. కనీసం దాని ఆధారంగానైనా గతంలో ప్రభుత్వం తెలంగాణ జల హక్కుల కోసం ప్రయత్నించలేదని అన్నారు. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని చెప్పారు.















