కరీంనగర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. తెలంగాణ ఉద్యమ కార్యకర్తలతో కలిసి మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటి వరకు ప్రకటించిన విధంగా ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఉద్యమ కార్యకర్తలకు 250 చదరపు గజాల స్థలాన్ని ఇస్తానంటూ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొలువు తీరి 2 ఏళ్లవుతున్నా ఎందుకని అమలు చేయడం లేదంటూ ప్రశ్నించింది. సర్కార్ పై నిప్పులు చెరిగింది కవిత.
బాధితులతో కలిసి గుడిసెలు వేశారు. పాలు పొంగించి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్బంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కార్యకర్తలకు అదే భూమిలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కమిటీల ద్వారా జాప్యాలను తిరస్కరిస్తూ, స్థానిక ధృవీకరణ, కార్యకర్తల ఫోరం డేటా ఆధారంగా కార్యకర్తల గుర్తింపు ఉండాలని ఆమె పట్టుబట్టారు . హామీలు నెరవేరే వరకు శాంతియుత భూ పోరాటం కొనసాగుతుందని ఆమె ప్రకటించారు.














