ఢిల్లీ : ఒక సమున్నత ఆశయ సాధన కోసం ఏర్పడింది కాంగ్రెస పార్టీ అని, అది ఈ లోకంలో సూర్యచంద్రులు ఉన్నంత కాలం నిలిచే ఉంటుందని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.
మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన శతాబ్ది సంవత్సరం, రాజ్యాంగం ఆమోదించబడిన 75వ సంవత్సరం , వందేమాతరం 150వ వార్షికోత్సవం ఈ ఏడాదే జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సరిగ్గా ఇదే రోజు 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని గుర్తు చేశారు ఖర్గే. ఆదివారం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కానీ సమున్నత ఆశయాలతో ప్రజల కోసం ఏర్పడిన పార్టీ. దీనిని ఎవరూ అంతం చేయలేరన్నారు.
అయితే ప్రస్తుతం మా బలం తక్కువగా ఉండవచ్చు, కానీ మా వెన్నెముక ఇంకా నిటారుగా ఉందని ప్రకటించారు మల్లికార్జున్ ఖర్గే. తాము విలువల విషయంలో, దేశాన్ని కాపాడడం విషయంలో తాము ఎన్నడూ రాజీ పడలేదని స్పష్టం చేశారు ఖర్గే. పేదల హక్కుల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అడ్డగోలుగా పాలన సాగిస్తున్న పాలకులపై నిరంతరం కాంగ్రెస్ పోరాడుతూనే ఉందన్నారు . ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని, దానికి ప్రధాన కారణం తమ పార్టీ బలంగా ప్రజల గొంతుక వినిపించడం వల్లనేనని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.

















