Malavika Mohanan : ప్రముఖ నటి మాళవిక మోహన్(Malavika Mohanan) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమ పట్ల ఫ్యాన్స్ , నెటిజన్స్ కు ఉన్న అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయని పేర్కొంది. చిట్ చాట్ సందర్బంగా కొందరు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చింది ముద్దుగుమ్మ. తమకు కథ ముఖ్యం. అందులో ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తున్నామా లేదా అని ఆలోచిస్తాం. వంద శాతం పర్ ఫెక్ట్ గా చేసేందుకు ప్రయత్నం చేస్తాం తప్పా అవతల ఎవరు ఉన్నారనే విషయం పట్టించుకోమంటూ కుండ బద్దలు కొట్టింది ఈ ముద్దుగుమ్మ.
Malavika Mohanan Shocking Comments
ఈ మధ్యన వయసు మళ్లిన హీరోలు ఇంకా తమ పిల్ల చేష్టలు చేస్తుండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి ఓ హీరోయిన్ ను ఈవెంట్ సందర్బంగా గోకాడు. ఈ వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలలో యంగ్ హీరోయిన్స్ తో పాటలు పడుతున్నారు. గెంతులు వేస్తున్నారు. ఆయనను అలా చూపిస్తేనే మూవీస్ హిట్ అవుతాయనే భ్రమలో ఉన్నాయంటున్నారు తమిళ సినీ దర్శకులు.
ఇక మలయాళం సూపర్ స్టార్ హీరో గా పేరు పొందిన మోహన్ లాల్ తో ఓ మూవీలో కీ రోల్ పోషించింది మాళవిక మోహన్. ఆయన వయసు 65 ఏళ్లు. అందులో సగం వయసు కూడా ఉండదు మాళవిక మోహన్ కు. ఈ ఇద్దరూ కలిసి నటించడం పట్ల ఫ్యాన్స్ ప్రశ్నలు లేవనెత్తారు. ఆయనతో ఎలా చేశారంటూ ప్రశ్నించారు. దీనిపై స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ప్రేమకు వయసుతో సంబంధం ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేసింది.
Also Read : Beauty Samantha :ముందుగా మేల్కొన్నా అందుకే విడిపోయా