టీవీకే విజ‌య్ ఎన్డీయేతో క‌లిసి రావాలి : త‌మిళి సై

పిలుపునిచ్చిన బీజేపీ నాయ‌కురాలు సౌంద‌ర‌రాజ‌న్

hellotelugu-TamilSaiSoundararajan

చెన్నై : వ‌చ్చే ఏడాది 2026లో త‌మిళ‌నాడు రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వత్త‌రంగా మారాయి. ప్ర‌స్తుతం ఎంకే స్టాలిన్ సార‌థ్యంలో అధికారంలో ఉంది. ఆ పార్టీని ఈసారి ప‌వ‌ర్ లోకి రాకుండా చేసేందుకు నానా తంటాలు ప‌డుతోంది కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్. ఈ మేర‌కు వ్యూహాలు ప‌న్నిన కేంద్ర మంత్రి, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా ఫెయిల్ అయ్యాడు. హిందీ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దే ప్ర‌య‌త్నం చేశాడు. ఆపై సీఎంను ఇబ్బంది పెట్టేందుకు గాను త‌మ పార్టీకి చెందిన ర‌విని గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించారు. అయినా ఎక్క‌డా తగ్గ‌లేదు. ఇదే స‌మ‌యంలో బీజేపీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావ‌డానికి నానా తంటాలు ప‌డ్డారు. ఇందు కోసం యంగ్ , డైన‌మిక్ లీడ‌ర్ కె. అన్నామ‌లైకి పార్టీ పగ్గాలు అప్ప‌గించారు. కానీ త‌న‌కు వ్య‌క్తిగ‌త ఇమేజ్ పెరిగిందే త‌ప్పా బీజేపీకి లాభం చేకూర్చ‌లేదు.

దీంతో త‌న‌ను అనూహ్యంగా మార్చేశారు. మ‌రో వైపు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ను త‌ప్పించారు. బీజేపీ నాయ‌కురాలిగా ప్ర‌స్తుతం కొన‌సాగుతున్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకేతో పాటు బీజేపీ, ఇత‌ర పార్టీల‌తో క‌లిసి పోటీ చేయాల‌ని ఇప్ప‌టి నుంచే పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగారు. అధికార పార్టీకి వ్య‌తిరేకంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఇదే స‌య‌మంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు ప్ర‌ముఖ న‌టుడు , క్రిష్ట‌య‌న్ క‌మ్యూనిటీకి చెందిన ద‌ళ‌ప‌తి విజ‌య్. ఆయ‌న టీవీకే పార్టీని ఏర్పాటు చేశాడు. ప్ర‌స్తుతం త‌ను డీఎంకే వ‌ర్సెస్ టీవీకే ఉండ‌బోతోంద‌ని ప్ర‌కటించాడు. ఈ స‌మ‌యంలో త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య్ ఒంట‌రిగా పోటీ చేయ‌డం వ‌ల్ల లాభం లేద‌ని, ఎన్డీయేతో క‌లిసి రావాల‌ని పిలుపునిచ్చారు. మ‌నంద‌రం

Exit mobile version