హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మూడు విడతలుగా నిర్వహిస్తోంది. తొలి విడత ఎన్నికలు ముగిశాయి. రెండో విడత ఎన్నికలు శనివారం నాటితో ముగుస్తాయి. ఈనెల 17వ తేదీతో పూర్తవుతాయి . తొలి విడత ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతులు గెలుపొందింది. బీఆర్ఎస్ 27 శాతం పదవులు గెలుపొందగా బీజేపీ 4.37 శాతం ఓట్లు పొందింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల్లో 2,864 మంది గెలుపొందారు. మొత్తం 4,235 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు 67.63 శాతం గెలిచారు. బీఆర్ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థులు 1,143 సీట్లలో విజయం సాధించారు. ఇక భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తో 185 మంది తో సరిపెట్టుకుంది.
ఎన్నికలు జరిగిన 31 జిల్లాల్లోనూ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. బీఆర్ఎస్, బీజేపీ 2,3వ స్థానాలలో నిలిచాయి. జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ 166 సీట్లలో 120 స్థానాలను గెలుచుకుంది . బీఆర్ఎస్ 37, బీజేపీ 9 స్థానాలతో సరి పెట్టుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 159 స్థానాలకు గాను కాంగ్రెస్ 120, బీఆర్ఎస్ 37 , ఇతరులు 17 స్థానాలలో విజయం సాధించారు. హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ 69 స్థానాలకు గాను కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 20, బీజేపీ 10 , జగిత్యాల జిల్లాలో 122 సీట్లకు గాను కాంగ్రెస్ 72, బీఆర్ఎస్ 37, బీజేపీ 12 స్థానాలు కైవసం చేసుకున్నాయి.
జనగాం జిల్లాలో 110 సీట్లకు గాను 81 సీట్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ 28, బీజేపీ ఒక సీటును గెల్చుకోగా ,
జయశంకర్ భూపాలపల్లిలో కాంగ్రెస్ తరపున 59, బీఆర్ఎస్ 21 , బీజేపీ 2 స్థానాలలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో కాంగ్రెస్ 106 సీట్లలో 88 విజయాలు సాధించింది, బీఆర్ఎస్ 8, బీజేపీ 10 సీట్లలో , కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ 167 సీట్లలో 100 గెలుచుకోగా బీఆర్ఎస్ 44, బీజేపీ 23 స్థానాలలో విజయం సాధించారు. కరీంనగర్ జిల్లాలో 92 సీట్లకు గాను కాంగ్రెస్ 60, ఖమ్మం జిల్లాలో 192 స్థానాలలకు 145 గెలుచుకుంది. బీఆర్ఎస్ 38 స్థానాలను కైవసం చేసుకుంది. 9 స్థానాలలో ఇతరులు గెలుపొందారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల , మెదక్ జిల్లాల్లో కూడా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ములుగు జిల్లాలో 48 స్థానాల్లో 37 స్థానాలతో, నాగర్ కర్నూల్‌లో 151 స్థానాల్లో 95 స్థానాలతో పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించింది. నల్గొండలో 318 స్థానాల్లో 231 స్థానాలతో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులకు అతిపెద్ద విజయాలలో ఒకటిగా నమోదైంది. ఇక నారాయణపేట జిల్లాలో 67 స్థానాల్లో 55 స్థానాలతో, నిర్మల్‌లో 136 స్థానాల్లో 98 స్థానాలతో కైవసం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ మద్దతుగల అభ్యర్థులు 153 స్థానాలను గెలుచుకోగా, బీఆర్ఎస్ 15, బీజేపీ 16 సీట్లను కైవసం చేసుకున్నాయి.
పెద్దపల్లిలో 74 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు , రాజన్న సిరిసిల్లలో 47, రంగారెడ్డి జిల్లాలో 103, సంగారెడ్డి జిల్లాలో 80 స్థానాలు, ఇతరులు తొమ్మిది స్థానాలు గెలుచుకున్నారు. సిద్దిపేటలో 163 సీట్లలో కాంగ్రెస్ 87 స్థానాలను గెలుచుకుంది. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 159 సీట్లలో 102 స్థానాలను గెలుచుకుంది. వికారాబాద్‌లో 262 సీట్లలో 189 స్థానాలతో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు తమ బలమైన ప్రదర్శనను కొనసాగించారు. వనపర్తి జిల్లాలో 87 సీట్లలో 51 స్థానాలను గెలుచుకున్నారు. వరంగల్ రూరల్‌లో 91 సీట్లలో 66 స్థానాలలో సత్తా చాటారు.. యాదాద్రి భువనగిరిలో అధికార పార్టీ 153 సీట్లలో 94 స్థానాలను గెలుచుకోగా బీఆర్ఎస్ 53, బీజేపీ 3 స్థానాలలో గెలుపొందారు.
















