హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్, నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ
మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లేఖ రాశారు. సీఎం రెండోసారి యూనివర్శిటీని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దృష్టికి పలు సమస్యలను గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వమే ఏర్పడ్డ విశ్వవి ద్యాలయాల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి అని తెలిపారు. వంద వసంతాలు పూర్తి చేసుకున్న ఈ యూనివర్సిటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు విద్యా పరంగానే గాక ఉద్యమాల పరంగా కూడా లభించిందిని స్పష్టం చేశారు. తెలంగాణ వాదం పురుడు పోసుకున్నది ఈ గడ్డపైనేనని పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్థులు, భోదన, భోదనేతర సిబ్బంది నిర్విరామ కృషి వల్లే రాష్ట్రం సాకారమైందనేది నగ్న సత్యం. దేశానికి ప్రధానిని, రాష్ట్రానికి పలువురు ముఖ్యమంత్రులను అందించిన ఘనత మన ఉస్మానియా యూనివర్సిటిదని తెలిపారు. అందులో మీరొకరు. ఇక్కడి పూర్వ విద్యార్థిగా యూనివర్సిటి పట్ల మీరు చూపిస్తున్న ప్రత్యేక ఆదరాభిమానాలు ప్రశంసనీయని పేర్కొన్నారు.
దీని అభివృద్ధిని ఆకాంక్షించి, అంతర్జాతీయ స్థాయిలో దీన్ని సమ్నుత స్థాయిలో నిలుపాలని భావించి వెయ్యి కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు జేఏసీ ఉద్యోగులు. గత రెండున్నర దశాబ్ధాల కాలం నుండి పాలకులు రాష్ట్రంలోని ఏ విశ్వవి ద్యాలయంలో కూడా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ నియామకాలు చేపట్టక పోవడంంతో అవన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగులతోనే నడుస్తున్నయని తెలిపారు.. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో 75% బోదనాసిబ్బంది అంతా కాంట్రాక్ట్ ఉద్యోగులేనని పేర్కొన్నారు. వీటిలో ఉన్న బడ్జెటెడ్ పోస్టులు 2878. ఇందులో 753 మంది రెగ్యులర్ అధ్యాపకులుంటే 1200 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులేనని తెలిపారు. వీరికి చెల్లిస్తున్న వేతనం జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలలోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు చెల్లిస్తున్న దానికన్నా తక్కువగా ఉండటం విచారకరం అన్నారు. వెంటనే పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు.
















