PM Modi : న్యూఢిల్లీ : అత్యంత ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ ను నిర్వహించేందుకు గాను భారత్ ఎంపికైంది. ఈ మేరకు భారీ ఎత్తున పోటీని తట్టుకుని బిడ్ లో ఇండియా పాల్గొంది. చివరకు 2030 సంవత్సరానికి గాను క్రీడలను నిర్వహించేందుకు కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi). కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి అహ్మదాబాద్ నగరం ఆతిథ్య నగరంగా ఆమోదించబడిన తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలను అభినందించారు. 74 కామన్వెల్త్ సభ్య దేశాలు, ప్రాంతాల ప్రతినిధులు గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీలో భారతదేశం ప్రతిపాదించిన బిడ్‌ను ఆమోదించారు.
PM Modi Interesting Comments
ఈ క్రీడలకు భారతదేశం ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. 2010లో, 19వ CWG ఎడిషన్ దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. శతాబ్ది కామన్వెల్త్ క్రీడలు 2030ని నిర్వహించడానికి భారతదేశం బిడ్‌ను గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు ప్రధాని. భారత ప్రజలకు, క్రీడా పర్యావరణ వ్యవస్థకు అభినందనలు. మన సమిష్టి నిబద్ధత , క్రీడా స్ఫూర్తి భారతదేశాన్ని ప్రపంచ క్రీడా పటంలో దృఢంగా నిలిపాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను అహ్మదాబాద్‌కు ఇవ్వాలనే కామన్వెల్త్ క్రీడ నిర్ణయాన్ని కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు.
ఈ సందర్భంగా దేశంలోని యువ అథ్లెట్లందరినీ నేను అభినందిస్తున్నాను. ఇంతటి భారీ కార్యక్రమం అథ్లెట్లకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలను ఇస్తుంది. దేశం అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రపంచంలో తన పెరుగుతున్న శక్తిని ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read : CM Revanth Reddy New Innovation : అందరికీ అందుబాటులో భారత రాజ్యాంగం



















