PM Modi : శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ప్రేమకు, సేవకు ప్రతి రూపం శ్రీ సత్యసాయి బాబా జీవితం ఇచ్చిన సందేశమని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi). బుధవారం పుట్టపర్తి లో జరిగిన సత్య సాయి బాబా శతాబ్ది వేడుకలకు పీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సచిన్ రమేష్ టెండూల్కర్ హాజరయ్యారు. అంతకు ముందు ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌లో శ్రీ సత్యసాయి బాబాకు నివాళులు అర్పించారు. దర్శనం కోసం ఓంకార్ హాల్‌కు వెళ్లారు. ఈ పవిత్ర స్థలాలలో ఉండటం మానవాళిని ఉద్ధరించడానికి ఆయన అపరిమితమైన కరుణ , జీవితాంతం నిబద్ధతకు నిదర్శనం అన్నారు.
PM Modi Key Comments Sri Sathya Sai Baba
సత్య సాయి బాబా ఇచ్చిన సందేశం ఒక్కటే ప్రేమ స్వరూపులుగా ఉండండి. నిస్వార్థంగా సేవలు అందించండి. అదే దైవంతో సమానం అని చెప్పారని గుర్తు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయనతో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఇవాళ ఇక్కడికి రావడం, ఈ పవిత్రమైన స్థలంలో నేను నమస్కరించడం, స్వామికి నివాళులు అర్పించడం పట్ల సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మాట్లాడుతూ మానవత్వమే కులం, ప్రేమే మతం సేవకు మించినది ఏదీ లేదన్నారు. టెండూల్కర్ ఆసక్తికర సన్నివేశాన్ని పంచుకున్నారు. బాబా తనకు పంపించిన పుస్తకం తనను మార్చేసిందని చెప్పారు.
Also Read : Sachin Tendulkar Important Comments : సత్యసాయి బాబా చూపిన మార్గం శిరోధార్యం



















