CM Chandrababu : అమరావతి : రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై విశ్వాసంతోనే గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. వాటిని సంరక్షించటంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషించాలని సూచించారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పోలీసు సంస్మరణ దినం ఫ్లాగ్ ధరించి.. ఫ్లాగ్ ఫండ్ కు విరాళం ఇచ్చారు. పోలీసుల గౌరవం పెంచటంతో పాటు వారి కుటుంబాల సంక్షేమం చూసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీ పోలీస్ అంటే ఓ బ్రాండ్ అని.. దానికి మరింత వన్నె తెచ్చేలా పని చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
CM Chandrababu Comments
కార్యక్రమంలో పోలీసులను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం దేశంలో శాంతి భద్రతల కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమర వీరులకు నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. 1959 అక్టోబర్ 21న చైనాపై వీరోచిత పోరాటంలో సీఆర్పీఎఫ్ కు చెందిన 10 మంది జవాన్లు అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ ప్రతీ ఏటా అక్టోబర్ 21న, పోలీస్ అమర వీరుల దినాన్ని నిర్వహించు కుంటున్నాం. వారి త్యాగాలను, బలి దానాన్ని గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్న పోలీసులు అంటే నాకెప్పుడూ గౌరవం. పోలీసులు చేసేది ఉద్యోగం కాదు..నిస్వార్థ సేవ అని అన్నారు.
Also Read : AP Govt Important Update : ఏపీ ఉద్యోగులకు సర్కార్ ఖుష్ కబర్


















