సికింద్రాబాద్ : తెలంగాణలో అత్యంత జనాదరణ పొందిన పండుగ బోనాల పండుగ. తమ కోర్కెలు తీరే మహిళలు అమ్మ వారికి బోనం సమర్పించడం ఈ పండుగ ప్రధాన ఉద్దేశం. ఇదిలా ఉండగా సికింద్రాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు 2 నుండి 4 వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా చూడటంలో అధికారులకు సహకరించాలని, ఈ తాత్కాలిక ఆంక్షలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పోలీసులు కోరారు. జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మల్కాజిగిరి జోన్‌లోని మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు ఆగస్టు 2 ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 4 ఉదయం 6 గంటల వరకు మూసి వేయబడతాయి. శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర (బోనాలు) ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు గాను సికింద్రాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసి వేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం మల్కాజిగిరి జోన్‌లోని మార్కెట్ , గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు మరియు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు ఆగస్టు 2 ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 4 ఉదయం 6 గంటల వరకు మూసి వేయబడతాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షించే వార్షిక బోనాల ఉత్సవాల భద్రత, శాంతిభద్రతల ఏర్పాట్లలో భాగంగా ఈ ఆంక్షలు విధించబడ్డాయి. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా చూడటంలో పోలీసులకు సహకరించాలని , ఈ తాత్కాలిక ఆంక్షలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని సిటీ పోలీస్ కమిషర్ వీసీ సజ్జనార్ కోరారు. ఆయన అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. భద్రతలో భాగంగా 2 వేల మందికి పైగా పోలీసులను మోహరించామన్నారు.
















