Minister Kandula Durgesh : విజయనగరం జిల్లా : సాంస్కృతిక, కళా రంగాలకు తమ కూటమి సర్కార్ పెద్దపీట వేస్తోందని చెప్పారు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh). విజయనగరం జిల్లా రాజాంలోని వస్త్రపురి కాలనీలో ఏర్పాటు చేసిన జి.యమ్.ఆర్ వరలక్ష్మి కళాక్షేత్రం ప్రారంభోత్సవ మహోత్సవంలో పాల్గొన్నారు. కళాక్షేత్రాన్ని ప్రారంభించి ప్రసంగించారు కందుల దుర్గేష్. భారతీయ సంస్కృతి, సాంప్రదాయం ప్రతిబింబించే కళా రూపాలను పరిరక్షించి, భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం కృషి చేస్తందని అన్నారు. సాంస్కృతిక, కళారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Minister Kandula Durgesh Interesting Update
కళాకారుల కృషిని గౌరవిస్తూ, కళాకారులకు అందరితోపాటు కాకుండా ప్రత్యేక పెన్షన్ అందించే విధానాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు కందుల దుర్గేష్. అలాగే, నాటక సమాజాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. తద్వారా కళాకారుల సంక్షేమానికి సంబంధించిన డేటా బ్యాంక్ సిద్ధమై సౌకర్యాలు అందించడం సులభతరం అవుతుందన్నారు.కళారంగం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తిగా, కళాకారుల అభ్యున్నతికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD)ను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకు రావాలన్న ప్రతిపాదనను ప్రతి సందర్భంలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు.
రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ కళారంగం కోసం చేస్తున్న కృషికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. జి.యమ్.ఆర్ వరలక్ష్మి కళాక్షేత్రం ఉత్తరాంధ్ర కళాకారులకు అద్భుత వేదికగా నిలవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ తరపున అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు.
Also Read : K Kavitha Sensational Update : తెలంగాణ జాగృతి సంస్థ ఐటీ వింగ్ ఏర్పాటు


















