DY CM Bhatti : ఖమ్మం జిల్లా : ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున బంద్ కు పిలుపు ఇచ్చారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇందులో భాగంగా హైదరాబాద్ లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి మాల మహానాడు నేత, ఎమ్మల్సీ అద్దంకి దయాకర్, టీజేఏసీ పార్టీ చీఫ్ కోదండ రాం రెడ్డి, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. బాబు జగ్జీవన్ రాం విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఇదిలా ఉండగా రేపు జరగబోయే బందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (DY CM Bhatti) కి వినతి పత్రం అంద చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మోడేపల్లి కృష్ణమాచారి.
BC Union Leaders Meet DY CM Bhatti Vikramarka
శుక్రవారం ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందజేశారు. 42% రిజర్వేషన్ కోసం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జరిపే రేపటి బంద్ కు బేషరతు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మసనం శివరామకృష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ, ఖమ్మం టౌను మహిళా అధ్యక్షురాలు గాజుల శ్రీదేవి, ఖమ్మం టౌన్ అధ్యక్షుడు గద్దె వెంకట రామయ్య ,ఉపాధ్యక్షుడు అమృతం మల్లికార్జున్ , యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Also Read : Manda Krishna Madiga Shocking : బీసీ బంద్ ను విజయవంతం చేయాలని ర్యాలీ

















