US Green Cards : అమెరికా : రోజు రోజుకు ప్రవాస భారతీయులు అమెరికాలో ఉండడం మరింత ఇబ్బందికరంగా మారనుంది. వచ్చే 2029 వరకు యుఎస్ గ్రీన్ కార్డ్ లాటరీలో ఎక్కువ మంది ఆసక్తి చూపక పోవచ్చని అంచనా. హెచ్ 1 బి, ఈబీ వీసాలు మరింత ఆలస్యం కాబోతున్నాయి. డీవీ లాటరీ మినహాయింపుతో యుఎస్ లో నివసించేందుకు పరిమిత మార్గాలను ఎదుర్కొంటున్నారు. దీంతతో గ్రీన్ కార్డ్ (US Green Cards) లాటరీగా ప్రసిద్ధి చెందిన యునైటెడ్ స్టేట్స్ డైవర్సిటీ వీసా లాటరీకి భారతదేశం కనీసం 2029 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా. ఇదిలా ఉండగా హెచ్ 1 బి, ఉపాధి ఆధారిత ఈబీ వీసాలలో బ్యాక్‌లాగ్‌లు భారతీయ దరఖాస్తుదారులకు శాశ్వత నివాసాన్ని మరింత కష్టతరంగా మార్చేలా చేశాయి.
US Green Cards Break
కాగా డైవర్సిటీ వీసా కార్యక్రమం గత ఐదు సంవత్సరాలలో 50,000 కంటే తక్కువ వలసదారులను అమెరికాకు పంపించాయి కొన్ని దేశాలు. అయితే ఈ పరిమితిని ఎప్పుడో దాటేసింది ఇండియా. ప్రతి ఏటా 60,000 కంటే ఎక్కువ మంది వలసదారులు, దానిని లాటరీ నుండి స్వయంచాలకంగా అనర్హులుగా చేస్తున్నారు. ఒక్క 2022లోనే భారతదేశం 1,27,010 మంది వలసదారులను పంపగా, దక్షిణ అమెరికా 99 వేల 30 మందిని, ఆఫ్రికా 89 వేల 570 మదిని, యూరప్ నుండి 75 వేల 610 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా వీరందరి కంటే ఇండియా నుంచి వెళ్లే వారు, ఆశించే వారే ఎక్కువగా ఉండడం విశేషం.
Also Read : TG High Court Shocking : స్థానిక సంస్థల ఎన్నికలపై తేల్చండి : హైకోర్టు


















