Hydraa : హైదరాబాద్ : ఒకప్పుడు అన్ని వర్గాలకు నెలవుగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు కబ్జారాయుళ్లు, బడా బాబులు, మాఫియా డాన్లకు కేరాఫ్ గా మారింది. కబ్జా రాయుళ్ల హవా కొనసాగుతోంది. ప్రత్యేకించి ప్రజా ప్రతినిధులు కొందరు వీరికి అండగా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైడ్రా (Hydraa) ఆక్రమణలను గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా కబ్జా రాయుళ్లకు కోలుకోలేని షాక్ ఇస్తోంది. శుక్రవారం హైడ్రా రంగంలోకి దిగింది. నగరం నడిబొడ్డున ఆక్రమణల పర్వానికి తెర దించే పనిలో పడింది. ఈ మేరకు గోషామహల్ నియోజకవర్గం కుల్సుంపురాలో కబ్జాలను తొలగించింది. ఆక్రమణకు గురైన1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రూ. 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది.
Hydraa Saved Huge Property
ఇదిలా ఉండగా ప్రజావసరాలకు ఈ భూమిని వినియోగించాలని భావించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా డబుల్ బెడ్ రూం ఇళ్లకు ప్రతిపాదనలు చేస్తోంది. ఆసిఫ్‌నగర్ మండలం కుల్సుంపూర్ విలేజ్‌లోని సర్వే నంబరు 50లో ఆక్రమణలను గుర్తించింది..బాజాప్తాగా తొలగించింది. అశోక్ సింగ్ ఆక్రమణలో ఉన్న మొత్తం 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా అందులో షెడ్డులు వేసి విగ్రహ తయారీదారులకు అద్దెకు ఇచ్చాడు. కుల్సుంపురలో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైడ్రాను కోరారు హైదరాబాద్ కలెక్టర్. గజం స్థలం కూడా దొరకని కుల్సుంపురలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని యోచిస్తోంది. ఈ సందర్బంగా స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా అధికారులు. కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారి ఆదేశాల మేరకు శుక్రవారం ఆక్రమణలను తొలగించారు.
Also Read : Komatireddy Raj Gopal Reddy Shocking Comments : పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నా


















