KTR : హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గురువారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ చచోటు చేసుకుందని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధిచి బీఆర్ఎస్ తరపున న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, ఈసీ తరపున న్యాయవాది అవినాశ్ వాదనలు వినిపించారు. జూబ్లీహిల్స్ లో 19 వందలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని , 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయని, అంతే కాకుండా కొంత మందికి రెండు ఓట్లు ఉన్నాయని వాదించారు. ఇటు తెలంగాణలో అటు ఏపీలో కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
Maganti Sunitha, KTR Filed Petition
పిటీషనర్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఈ ఓట్ల చోరీ గురించచి చీఫ్ ఎలక్షన్ అధికారికి ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు మాగంటి సునీత, కేటీఆర్ (KTR) తరపు న్యాయవాది. దీనిపై అభ్యంతరం తెలిపారు
ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు ఈసీ న్యాయవాది అవినాశ్. ఈనెల 21వ తేదీ వరకు పరిశీలన చేస్తారని వెల్లడించారు కోర్టుకు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిని సైతం వివరణ అడిగినట్లు తెలిపారు. విచారణ అనంతరం ఈ పిటీషన్ లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఓట్ల చోరీ గురించి పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థి సునీత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Also Read : TPCC Chief Mahesh Kumar Fired on BRS : తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసింది
















