BC Reservation : హైదరాబాద్ : బీసీ న్యాయ పరమైన రిజర్వేషన్ల ఉద్యమానికి జై కొట్టింది అఖిలపక్షం. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించడానికి ప్రధాని నరేంద్ర మోడీని అఖిలపక్షంతో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేసింది అఖిలపక్షం. బీసీ రిజర్వేషన్లు (BC Reservation) పెంచే వరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించవద్దని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కళింగ భవన్ లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే పరిష్కార మార్గాలు భవిష్యత్ కార్యాచరణ పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు బీసీ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది.
BC Reservation Updates
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వి. హనుమంత రావు, అద్దంకి దయార్, ఈరావత్ అనిల్ , టీజేఎస్ నుంచి కోదండ రాం రెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం , బీజేపీ నుంచి ఆనంద్ కుమార్ గౌడ్, సీపీఎం నుంచి బండారు రవి కుమార్, సీపీఐఎం ఎంఎల్ నుంచి గోవర్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండ రాం రెడ్డి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తాము మద్దతు ఇస్తామన్నారు. తమ పార్టీ తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. 50 శాతం అనేది రాజ్యాంగం లో లేదన్నారు. ఈ విషయాన్ని కోర్టులు కూడా చెప్పలేదన్నారు. న్యాయ పరంగా పోరాటం చేయాలని , ఆప వద్దని కోరారు. ఇందుకు సంబంధించి అన్ని ప్రజాస్వామ్య శక్తులు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
Also Read : Minister Savitha Important Update : అన్నపర్రు ఘటనలు పునరావృతం కానివ్వొద్దు


















