Jajula Srinivas Goud : హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్నీ నిరసిస్తూ ఈనెల 13న జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని ప్రకటించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud). ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్ల పై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడం అప్రజాస్వామికమని అన్నారు. బీసీ రిజర్వేషన్లను రక్షించు కోవడానికి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు . అందులో భాగంగానే హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కళింగ భవన్ లో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, సామాజిక తత్వవేత్తలతో విసృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
Jajula Srinivas Goud Slams
ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ (BC Reservation) లను రక్షించుకోవడానికి, తదుపరి బీసీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేయడానికి రేపు జరిగే అఖిలపక్ష పార్టీలు, బిసి సంఘాల సమావేశంలో విసృతంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల వైఖరిని ఎండగడుతూ, అలాగే హైకోర్టు స్టేను నిరసిస్తూ తెలంగాణలోని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. హైదరాబాదులోని బషీర్ బాగ్ లో ఉన్న బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం వద్ద, ఉస్మానియా యూనివర్సిటీలో సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మని మంజరి సాగర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ ,గూడూరు భాస్కర్ మేరు, నరసింహ, తారకేశ్వరి, సమత యాదవ్,, సంధ్యారాణి,గౌతమి, శారద, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
Also Read : Super GST Super Savings : 16న కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ


















