MP R Krishnaiah : హైదరాబాద్ : బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య (MP R Krishnaiah). ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ముందు వెనుకా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం బీసీల పాలిట శాపంగా మారిందన్నారు. ఆర్ . కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీశారని వాపోయారు. బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. బీసీల నోటి కాడ ముద్దను లాక్కున్నారంటూ మండిపడ్డారు. మా కోటా మా వాటా అన్నది మా నినాదం అన్నారు.
MP R Krishnaiah Slams Congress Govt
గత కొన్నేళ్లుగా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి తాను పోరాడుతూ వస్తున్నానని చెప్పారు. ఇవాళ బిల్లు పాస్ కాకుండానే జీఓను ఎలా తీసుకు వచ్చారంటూ కాంగ్రెస్ సర్కార్ ను సూటిగా ప్రశ్నించారు ఆర్. కృష్ణయ్య. కావాలని బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని చూశారని మండిపడ్డారు. కానీ సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీ సమాజం దీనిని సహించ బోదని వార్నింగ్ ఇచ్చారు. బీసీలతో రాజకీయాలు చేయాలని చూడటం పులిపై స్వారీ చేయడం లాంటిదేనని హెచ్చరించారు. ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళితే చివరకు ఇలాగే అవుతుందన్నారు. బీసీలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే తట్టుకోలేరని అన్నారు.
Also Read : AIADMK Challenge : తమిళనాట గెలుపు మాదేనన్న అన్నాడీఎంకే
















