Minister Ponnam : హైదరాబాద్ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు స్టే విధిస్తుందని తాము అనుకోలేదన్నారు. స్టే ఇచ్చిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ తాము బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లకు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. తమకు ఉన్న చిత్తశుద్దిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
Minister Ponnam Prabhakar Shocking Comments
అయితే హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించడం జరిగిందని చెప్పారు మంత్రి. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించిందని, ఆ తర్వాత కమిషన్ కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఇందుకు గాను కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శాసన సభలో చట్టం చేసి ఆమోదం కోసం గవర్నర్ వద్దకు బిల్లు పంపించామన్నారు. ప్రస్తుతం గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామన్నారు.
Also Read : KTR Fired on Congress Govt : పెంచిన ఛార్జీలు తగ్గేంత వరకు పోరాటం
















