Satyakumar Yadav : విజయవాడ : ఏపీలోని మైనార్టీల అభ్యున్నతి కోసం తమ కూటమి సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Satyakumar Yadav). విజయవాడలో జరిగిన బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియ చేశారు. బాషా నాయకత్వంలో మైనారిటీ మోర్చా మరింత బలపడుతుందనే నమ్మకం ఉందన్నారు సత్య కుమార్ యాదవ్. అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీల అభివృద్ధే తమ సర్కార్ ధ్యేయమని స్పష్టం చేశారు.
AP Health Minister Satyakumar Yadav Comments
మైనారిటీల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు సత్య కుమార్ యాదవ్. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం NDA ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రాన్ని ఏలిన జగన్ రెడ్డి సర్కార్ మైనార్టీల సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఇవాళ అన్ని వర్గాల అభ్యున్నతి , సంక్షేమం కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. కూటమి సర్కార్ ప్రతి ఒక్క రంగానికి చేయూత ఇచ్చేలా ప్లాన్ చేసిందన్నారు. ఓ వైపు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, విద, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు సత్య కుమార్ యాదవ్.
Also Read : MLA Bandaru Sravani interesting Comments : ఆర్డీటీ సంస్థకు అండగా ఉంటాం

















