TCS : దేశంలోని అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది.
TCS Growth
కంపెనీ సమగ్ర లాభం 1.39 శాతం పెరిగి ₹12,075 కోట్లు గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం ₹11,909 కోట్లు ఉండగా, ఈసారి స్వల్ప వృద్ధి సాధించింది.
అలాగే, ఆపరేషన్ల నుండి ఆదాయం 2.39 శాతం పెరిగి ₹65,799 కోట్లు గా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ₹64,259 కోట్లు మాత్రమే సాధించింది.
క్రమానుగతంగా పరిశీలిస్తే, లాభం 5.3 శాతం తగ్గినా, రెవెన్యూ 3.7 శాతం పెరిగిందని కంపెనీ వెల్లడించింది.
కంపెనీ బోర్డు రెండవ ఇంటరిమ్ డివిడెండ్‌గా ప్రతి షేరుకు ₹11 చొప్పున ప్రకటించింది.
గురువారం బీఎస్‌ఈలో టీసీఎస్ షేర్ ధర ₹3,061.95 వద్ద ముగిసింది, ఇది గత ముగింపు ధర కంటే 1.16 శాతం ఎక్కువ. ఈ ఫలితాలను మార్కెట్ ముగిసిన తర్వాత ప్రకటించారు.
Also Read : Arvind Virmani-India Growth : భారత ఆర్థిక శక్తి కొత్త దిశలో – జర్మనీలో గ్లోబల్ సమ్మిట్‌లో చర్చ



















