Abhishek Singhvi : హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కీలకమైన వాదోప వాదనలు చోటు చేసుకున్నాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండ కూడదన్నది కోర్టు ఆదేశం మాత్రమేనని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ లాయర్ అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi). భారత రాజ్యాంగంలో ఎక్కడా ఇలాంటి నిబంధన లేదన్నారు. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లును సమర్థించాయని చెప్పారు. చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదన్నారు. కాకపోతే చట్టం ఆధారంగా జారీ చేసిన GOలను ఛాలెంజ్ చేశారని తెలిపారు. GOకు మూలమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను మాత్రమే ఛాలెంజ్ చేయడం కుదరదన్నారు అభిషేక్ సింఘ్వీ.
MP Abhishek Singhvi Key Comments
రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50 శాతం దాటకూడదు అని సుప్రీంకోర్టు ఆదేశమే తప్పితే రాజ్యాంగంలో ఎక్కడా ఎలాంటి నిబంధన ఈ పరిమితి విధించ లేదన్నారు. డేటా ఆధారంగా ప్రభుత్వానికి, శాసన వ్యవస్థకు తగిన నిర్ణయం తీసుకునే అధికారం ఉందన్నారు. 2018లో తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం పాసైన సమయంలో ఈ కసరత్తు జరగ లేదని పేర్కొన్నారు. 2019లో EWS 10% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని స్పష్టం చేశారు సింఘ్వీ. ఫలితంగా మొత్తం రిజర్వేషన్లు 50% దాటి అదనంగా 10 %.. అంటే మొత్తం రిజర్వేషన్ల శాతం 60 శాతానికి చేరుకుందన్నారు. ఎంపిరికల్ డేటా ఉంటే గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదన్నారు. గవర్నర్ కి పంపిన బిల్లును ఆమోదించ లేదని, అలాగని వెనక్కి పంపనూ లేదన్నారు. గవర్నర్ కి బిల్లును పంపి నెల కాదు, 6 నెలలు గడిచాయన్నారు.
Also Read : Underwater River Metro Interesting : భారత చరిత్రలో మొదటిసారి – నీటి అడుగున దూసుకెళ్తున్న మెట్రో రైలు!
















