Director Mohan: ప్ర‌సాదంలో గర్భనిరోధక మాత్రలు కలపండి ! ద‌ర్శ‌కుడు మోహన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు !

ప్ర‌సాదంలో గర్భనిరోధక మాత్రలు కలపండి ! ద‌ర్శ‌కుడు మోహన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు !

Hello Telugu - Director Mohan

Director Mohan: తిరుమ‌ల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వం హాయాలంలో జంతు కొవ్వు కలిగిన కల్తీ నెయ్యి ఉపయోగించారు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ల‌డ్డు ఇష్యూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌ గా ఉంటే తాజాగా త‌మిళ‌నాడులో ఓ సినిమా ద‌ర్శ‌కుడు చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌ను అరెస్టు చేసే వ‌ర‌కు వెళ్లాయి. ద్రౌప‌తి, రుద్ర తాండ‌వం, బ‌కాసుర‌న్ వంటి త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌తో ఇండస్ట్రీలో అగ్ర‌ ద‌ర్శ‌కుడిగా గుర్తింపును ద‌క్కించుకున్నాడు డైరెక్ట‌ర్ జి.మోహన్… తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం పళని దేవాలయంలో ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

Director Mohan Comments Viral

ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో దర్శకుడు మోహన్ మాట్లాడుతూ… త‌మిళ‌నాడులో ప్ర‌సిద్ది చెందిన ప్ర‌సాదంగా చెప్పుకునే పంచామృతంపై తీవ్ర వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ‘పళని దేవాల‌యంలోని పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలపండి’ ఆంటూ ఆయ‌న అన్న మాట‌లు తీవ్ర దుమారం లేపాయి. దీంతో ప‌లువురు ఆయ‌న‌పై ఫిర్యాదు చేయ‌డంతో మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలో జి.మోహన్‌ను పోలీసులు అరెస్టు చేసి తిరుచ్చికి తరలించారు. అయితే దర్శకుడు ఏ సందర్భంగా అలాంటి వ్యాఖ్యలు చేసారు అనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు.

Also Read : Sinners: ఆకట్టుకుంటోన్న హాలీవుడ్ హర్రర్ మూవీ “సిన్న‌ర్స్” ట్రైలర్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com