Indian Railways : ఢిల్లీ : భారతీయ రైల్వే శాఖ ఖుష్ కబర్ చెప్పింది. ప్రతి నిత్యం లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా రైల్వే (Indian Railways) ప్రయాణీకులు, యాత్రికులను దృష్టిలో పెట్టుకుని మరిన్ని అదనపు సౌకర్యాలతో పర్యాటక రైళ్లను కొత్తగా ప్రారంభించింది. ఈ రైళ్లు ప్రముఖ ఆలయాలను దర్శించుకునే వీలును కల్పిస్తోంది. వచ్చే నెల నవంబర్ నెల 16న స్పెషల్ ట్రైన్ 11 రోజుల పాటు తమిళనాడు, కేరళ దేవాలయాలను కవర్ చేస్తుంది. ప్రదోషం రోజున నటరాజ స్వామిని, మాసిక్ శివరాత్రి రోజున అరుణాచలేశ్వరుడిని దర్శనం చేసుకునేలా ప్లాన్ చేసింది రైల్వే శాఖ.
Indian Railways Key Update
ఇందుకు సంబంధించి ఛార్జీలను కూడా వెల్లడించింది. స్లీపర్ క్లాస్ అయితే రూ. 19,950 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏసీ కోచ్ లు కావాలని అనుకుంటే రూ. 42,950 ఛార్జీలు చెల్లించాలి. అపరిమితంగా దక్షిణ భారతీయ వంటకాలు, ఆన్ బోర్డ్ వినోదం, స్పెషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు ప్రయాణీకులకు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది . రెండో ప్యాకేజీ నవంబర్ 26వ తేదీన ప్రారంభం అవుతుందని తెలిపింది. ఇది 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో నిష్కలంక్ మహాదేవ్ సముద్ర ఆలయం, జ్యోతిర్లింగంతో సహా పంచ ద్వారక యాత్ర ఉంటుంది. మోక్షద ఏకాదశి నాడు ద్వారకాదిష్‌లో ప్రత్యేక దర్శనం ఉంటుంది. టిక్కెట్ల ధర రూ.41,150 నుంచి రూ.63,000 మధ్య ఉంటుందని పేర్కొంది.
Also Read : Piyush Goyal New Innovation : త్వరలో డిజిటల్ కరెన్సీ ప్రారంభిస్తాం : గోయెల్
















