CM Mamata Banerjee : కోల్ కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలపై కూడా కేంద్రం, బీజేపీ రాజకీయం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రాలకు సాయం చేయాల్సింది పోయి వివక్ష చూపిస్తే ఎలా అని ప్రశ్నించారు. ధృవీకరించబడిన ఆధారాలు లేదా సరైన దర్యాప్తు లేకుండా ప్రధాని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాలని నిందిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు . వరదల కారణంగా తాను ఉత్తర బెంగాలలో వరద ముంపునకు గురైన ప్రాంతాలను, బాధితులను పరామర్శించారు.
CM Mamata Banerjee Slams PM Modi
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు సీఎం మమతా బెనర్జీ. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. ప్రతిదీ రాజకీయం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధారమైన విమర్శలు చేయడం తప్పని పించడం లేదా అని నిలదీశారు. పీఎం సరైన దర్యాప్తు కోసం వేచి ఉండకుండా ప్రకృతి వైపరీత్యాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు. తీవ్ర ఆందోళనకరం అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. ముఖ్యంగా ఉత్తర బెంగాల్‌లోని ప్రజలు వినాశకరమైన వరదలు, కొండ చరియలు విరిగి పడిన పరిణామాలతో సతమతమవుతుండగా సాయం చేయాల్సి పోయి అభాండాలు వేస్తే ఎలా అని సీరియస్ అయ్యారు సీఎం.
Also Read : Minister Savitha Important Meeting : ఎంజేపీ స్కూళ్ల అభివృద్ధికి సహకరించండి


















