Minister Savitha : అమరావతి : ఏపీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మహర్షి వాల్మీకి జయంతి ఇవాళ. సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాల మేరకు వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ మేరకు అక్టోబర్ 7వ తేదీ మంగళవారం దీనిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది సర్కార్. ఈ విషయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత (Minister Savitha) వెల్లడించారు. కర్నూలులో రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతేడాది నుంచి మహార్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
Minister Savitha Interesting Comments on Valmiki Jayanti
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో వాల్మీకి జయింతిని నిర్వహించనున్నట్లు తెలిపారు. కర్నూలులో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంత్యోత్సవాన్ని చేపట్టనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు మంత్రి సవిత. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని యువగళం పాదయాత్రలో మంత్రి లోకేశ్‌కు అప్పట్లో భారీ సంఖ్యలో వినతులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో బీసీల ఆత్మ గౌరవానికి ప్రాముఖ్యతనిస్తూ, ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.
Also Read : CM Siddaramaiah Sensational Comments : నేను కోరుకుంటే తప్పా నన్నెవరూ మార్చరు


















