Minister Ponnam : హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టారు. ఆయన త్వరలో జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. మొన్నటికి మొన్న బ్రేక్ ఫాస్ట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. తాజాగా నగరంలోని ఎర్రంమంజిల్ లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక , ఉన్నత పాఠశాల భవనాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నూతనంగా నిర్మిస్తున్న నిమ్స్ కు కేటాయించిన ప్రాంతంలో ఈ పాఠశాల పాత భవనంలో ఇప్పటి వరకు కొనసాగేది.
నిమ్స్ విస్తరణలో భాగంగా నూతన బ్లాక్స్ నిర్మిస్తున్న నేపథ్యంలో పాఠశాలకు కూడా నూతన భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా 40 గదులతో రెండతస్తుల్లో నూతన భవనాన్ని ఎంఈఐఎల్ నిర్మించింది. ఈ భవనాన్ని జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam), స్థానిక ఎం ఎల్ ఏ దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ విజయారెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఎం ఈ ఐ ఎల్ ప్రాజెక్ట్స్ విభాగం అధ్యక్షులు కే గోవర్ధనరెడ్డి, ఎం ఈ ఐ ఎల్ ప్రాజెక్ట్ మేనేజర్ బాలబొమ్ము నాగేంద్రబాబు తదితరుల సమక్షంలో ప్రారంభిస్తారు.
Minister Ponnam Prabhakar Comments
ప్రాధమిక, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక గదులు, గ్రంధాలయం, ల్యాబ్ మొదలైనవి రెండు అంతస్తుల్లో నిర్మించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరో మూడొందల మంది విద్యార్థులు పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నూతన భవనాన్ని నిర్మించారు. అదనంగా మరో రెండు అంతస్తులు భవిష్యత్తులో నిర్మించుకునేందుకు అనువుగా దీని డిజైన్ రూపొందించారు. ఇదే ప్రాంతంలో ఉన్న రవీంద్ర నికేతన్ ఎయిడెడ్ పాఠశాలకు కూడా నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాఠశాలలో 2200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులు పెరిగినా భవిష్యత్ లో మరో రెండు అంతస్తులు నిర్మించుకునేందుకు అనువుగా డిజైన్ తయారు చేశారు. నిర్మాణ దిశలో ఉన్న దీనిని త్వరలో ప్రారంభించనున్నారు.
Also Read : CM Chandrababu – Srisailam Growth : శ్రీశైలం ఆలయ అభివృద్దికి మాస్టర్ ప్లాన్ : చంద్రబాబు

















