CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఉత్సవ్ చేపట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ బాధ్యులు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారంపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఫోకస్ పెట్టాలన్నారు. ఈ సందర్బంగా ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu New Innovation
చేసిన పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే… ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుందన్నారు. ప్రజలతో మమేకం కావడమే కాదు మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు, నేతలు కేడరే పార్టీకి ప్రతినిధులు అన్నారు. పార్టీకి ప్రతినిధుల్లాంటి వారు తమ వ్యవహర శైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలన్నారు ఏపీ సీఎం. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని ఆరోపించారు . కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని అన్నారు. పీక్ లోడ్ లో కరెంట్ కొనుగోలు చేయకుండా స్వాపింగ్ విధానాన్ని అనుసరించామని చెప్పారు. సోలార్, విండ్ వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టామన్నారు. సమర్థ పాలనకు అసమర్థ పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలన్నారు.
Also Read : Hero Chiranjeevi – OG Movie : పవన్ కళ్యాణ్ ఓజీని చూసిన మెగాస్టార్
















