Asia Cup 2025 : దుబాయ్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సూపర్ ఫోర్ లో భాగంగా నిర్వహించిన కీలక పోరులో దాయాది పాకిస్తాన్ దుమ్ము రేపింది . తన ప్రత్యర్థి బంగ్లాదేశ్ ను 11 పరుగుల తేడాతో ఓడించింది. ఫైనల్ కు చేరుకుంది దర్జాగా. ఇదిలా ఉండగా ముచ్చటగా మూడోసారి తన చిరకాల ప్రత్యర్థి భారత జట్టుతో తలపడనుంది పాకిస్తాన్ జట్టు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డారు రెండుసార్లు. ఈ రెండింటిలోనూ పాకిస్తాన్ చేతులెత్తేసింది. ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో సత్తా చాటింది దాయాది జట్టు. దీంతో మరోసారి ఇరు జట్లు ఫైనల్ పోరుకు సిద్దం కానున్నాయి. తాడో పేడో తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉండగా ఆసియా కప్ టోర్నీ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన శ్రీలంక జట్టుతో శుక్రవారం భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ఇండియాకు అంతగా ప్రాధాన్యత లేక పోయినప్పటికీ ఇప్పటి వరకు ఆయా మ్యాచ్ లలో ఆడని వారిని ఇందులో ఆడించే ఛాన్స్ ఉంది.
Asia Cup 2025 Final List
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది పాకిస్తాన్ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ టీం 136 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా చివరి వరకు పోరాడింది.కానీ 124 పరుగులకే పరిమితమైంది 9 వికెట్లు కోల్పోయి. పాకిస్తాన్ బౌలర్లలో అఫ్రిది 17 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. రౌఫ్ 33 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ హారిస్ 23 బంతుల్లో 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉండగా హ్యాండ్‌షేక్ వివాదంతో పాటు ఆటగాళ్ల మధ్య గొడవలు కూడా జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత్ గెలిచింది. రెండు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు కరచాలనం చేసుకోలేదు.
Also Read : Instagram Strong Focus : సేఫ్టీ ఫీచర్స్ పై ఇన్‌స్టాగ్రామ్ ఫోకస్



















