Ayyannapatrudu : అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సోమవారం కీలక ప్రకటన చేశారు. 16వ శాసనసభ 4వ సమావేశంలో భాగంగా స్పీకర్ రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు.ఏపీ శాసనసభ నియమావళి 220(1) నిబంధనల ప్రకారం విశాఖ డెయిరీ (పాడి) లో చోటు చేసుకున్న అవినీతి అవకతవకలపై విచారణ జరుపుతోంది ప్రత్యేక సభా సంఘం . కాగా తుది నివేదిక సమర్పించేందుకు గాను మరికొంత సమయం పొడిగించాలని చైర్మన్ స్పీకర్ ను కోరారు. దీనిపై విచారణ చేపట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayyannapatrudu) సంఘం చైర్మన్ అభ్యర్థన మేరకు మరో ఆరు నెలలు పొడిగించినట్లు సభా వేదికగా తెలిపారు.
AP Assembly Speaker Ayyannapatrudu Comments
ఇదిలా ఉండగా గతంలో ఏపీలో వైఎస్సార్సీపీ జగన్ మోహన్ రెడ్డి పాలనా కాలంలో విశాఖ డెయిరీలో పెద్ద ఎత్తున అవినీతి , అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్తాయిలో విచారణ జరిపించేందుకు సభా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందు కోసం చైర్మన్ తో పాటు సభ్యులను నియమించారు. ఈ సంఘం విచారణ జరుపుతోంది.
అంతే కాకుండా 2019–2024 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (ఆప్కాబ్), జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్)లపై విచారణ నిమిత్తం మే 5వ తేదీన ఏర్పాటు చేసిన ప్రత్యేక సభా సంఘాన్ని మరల పునర్ వ్యవస్థీకరించినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
Also Read : Minister Gottipati Ravi Important Update : కాలుష్య నియంత్రణ కోసం రూ. 500 కోట్లు















