Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో విక్రయించే రైల్‌నీర్ బ్రాండ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ధరలను తగ్గిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ (Indian Railways) నిర్ణయం తీసుకుంది.
Indian Railways – కొత్త ధరలు
- 1 లీటర్ బాటిల్: రూ. 15 నుండి రూ. 14కు తగ్గింపు
- 500 మిల్లీలీటర్లు: రూ. 10 నుండి రూ. 9కు తగ్గింపు
ఇంతకు ముందు 1 లీటర్ బాటిల్ రూ. 15, హాఫ్ లీటర్ బాటిల్ రూ. 10 ధరకు లభించగా, సెప్టెంబర్ 22 సోమవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
జీఎస్టీ తగ్గింపు ప్రభావం
తాజాగా జీఎస్టీ కౌన్సిల్ పలు వస్తు సేవలపై పన్ను తగ్గించడంతో, ఆ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇతర బ్రాండ్లకూ వర్తింపు
రైల్వే ప్రాంగణాలు, రైళ్లలో విక్రయించే ఇతర బ్రాండ్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్‌పై కూడా ఈ తగ్గింపు వర్తించనుంది. IRCTC/రైల్వేలు షార్ట్‌లిస్ట్ చేసిన వాటర్ బాటిల్స్ గరిష్ట రిటైల్ ధరను సవరించి 1 లీటర్‌కు రూ. 14, హాఫ్ లీటర్‌కు రూ. 9గా నిర్ణయించారు.
Also Read : Trump Shocking H-1B,H-4 Visa Holders : హెచ్-1బీ వీసా ఫీజులపై ట్రంప్ సంచలన నిర్ణయం


















