Metro Rail : దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో రైలు (Metro Rail) సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో నోయిడా మెట్రో ఆక్వా లైన్‌ను గ్రేటర్ నోయిడా (Noida) వెస్ట్ వరకు విస్తరించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (PIB) అనుమతికి ఎదురు చూస్తోంది.
Metro Rail – ప్రాజెక్ట్ దశలు:
- ఈ విస్తరణ రెండు దశల్లో పూర్తవనుంది.
- మొదటి దశలో సెక్టార్-51 నుండి సెక్టార్-2 వరకు లైన్ నిర్మాణం జరుగుతుంది.
- రెండో దశలో గ్రేటర్ సెక్టార్-2 నుండి గ్రేటర్ సెక్టార్-5 వరకు విస్తరిస్తారు.
- ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ప్రత్యక్ష లాభం పొందనున్నారు.
లైన్ పొడవు & స్టేషన్లు:
- మొత్తం 17.435 కి.మీ. పొడవైన ఈ మార్గంలో 11 స్టేషన్లు ఉంటాయి.
- నోయిడా ప్రాంతంలో 3.33 కి.మీ. పొడవుతో 3 స్టేషన్లు
- గ్రేటర్ నోయిడాలో 14.105 కి.మీ. పొడవుతో 8 స్టేషన్లు ఏర్పాటవుతాయి.
- ప్రతిరోజూ దాదాపు 1.23 లక్షల మంది ఈ మార్గాన్ని వినియోగించే అవకాశం ఉంది.
అంచనా వ్యయం & నిధుల వనరులు:
- ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 2,991.60 కోట్లు.
- నోయిడా 33%
- గ్రేటర్ నోయిడా 67% ఖర్చు భరిస్తాయి.
అదనంగా, నిధుల సమీకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 12.97%, NCR ప్లానింగ్ బోర్డు 44.98%, గ్రేటర్ నోయిడా అథారిటీ 10.04%, నోయిడా అథారిటీ 5%, అలాగే GIA, GeoUP భాగస్వామ్యం చేస్తాయి.
ముఖ్యమైన స్టేషన్లు:
ఈ మార్గంలో సెక్టార్-51, సెక్టార్-61 (ఇంటర్‌చేంజ్ హబ్), సెక్టార్-70, సెక్టార్-122, సెక్టార్-123, గ్రేటర్ సెక్టార్-2, గ్రేటర్ సెక్టార్-3, గ్రేటర్ సెక్టార్-10, గ్రేటర్ సెక్టార్-12, నాలెడ్జ్ పార్క్-5 వంటి కీలక స్టేషన్లు ఏర్పాటవుతాయి. ఇవి స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
నిర్మాణం త్వరలో ప్రారంభం:
అధికారుల ప్రకారం, PIB అనుమతి లభించిన వెంటనే మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది చివరి నాటికి సివిల్ వర్క్స్ పూర్తి చేసేలా లక్ష్యాలు నిర్దేశించబడ్డాయి.
ప్రయోజనాలు:
నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహేంద్ర ప్రసాద్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అవకాశాలు కల్పించనుంది. అంతేకాక, ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాలపై సానుకూల ప్రభావం చూపనుంది.
Also Read : Gold Price Growth : పసిడి ప్రియులకు స్వల్ప ఉరటనిచ్చిన ధరలు



















