IND vs PAK : దుబాయ్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2025 మెగా టోర్నీలో ఆదివారం కీలకమైన భారత, పాకిస్తాన్ (Pakistan) జట్ల మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టికెట్లు అమ్ముడు పోయాయి. మరో వైపు పహల్గామ్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసిస్తూ మ్యాచ్ ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున కోరుతున్నారు భారతీయులు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కేంద్రం. మరో వైపు దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. కొన్నేళ్లుగా ఇరు జట్లు తమ తమ దేశాలలో ఆడడం లేదు. కేవలం తటస్థ వేదికగా ఆడుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగనుంది.
IND vs PAK Match Updates
ఇక సోషల్ మీడియాలో బాయ్ కాట్ భారత్ (India), పాకిస్తాన్ మ్యాచ్ అంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ లతో హోరెత్తిస్తున్నారు. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరో వైపు ఇవాళ జరిగే కీలక మ్యాచ్ కు సంబంధించి ఎలాంటి ఆందోళనలు, సంఘటనలు తలెత్తకుండా భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేసింది యూఏఈ సర్కార్. ప్రత్యేకించి భారత జట్టుకు కనీవిని ఎరుగని రీతిలో భద్రతను కల్పించింది. ప్రస్తుతం ఆసియా కప్ హాట్ ఫెవరేట్ గా ఉంది టీమిండియా. భారత్ తన తొలి మ్యాచ్ లో ఆతిథ్య జట్టు యూఏఈపై 9 వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది.
జట్ల పరంగా చూస్తే భారత్ జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టన్, శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ , అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ , అర్ష్ దీప్ , కుల్దీప్ , సంజూ శాంసన్ , హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఉన్నారు.
ఇక పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా కెప్టెన్ కాగా, అబ్రార్, ఫహీమ్ , ఫఖర్ జమాన్ , హరీష్ రవూఫ్ , హసన్ అలీ, హసన్ నవాజ్ , హుస్సేన్ తలాత్ , ఖుష్టిల్ వాజ్, మొహమ్మద్ వా, షా మహమ్మద్ షా, జూనియర్, ఫర్హాన్ , సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్ ఆడతారు.
Also Read : Vijay Interesting Comments : మహిళల భద్రతకు ప్రయారిటీ : విజయ్


















