Cars : ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది సరైన సమయం కావొచ్చు. జీఎస్‌టీ నిర్మాణంలో మార్పుల అనంతరం హ్యుందాయ్ (Hyundai), టయోటా, టాటా (TATA), మహీంద్రా (Mahindra), రెనాల్ట్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు భారీ రాయితీలు ప్రకటించాయి. కొన్ని మోడళ్లపై రూ.3.5 లక్షల వరకు తగ్గింపులు లభ్యమవుతున్నాయి. బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ప్రీమియం ఎస్‌యూవీల వరకు ధరలు తగ్గడంతో వినియోగదారులకు కొత్త వాహనం కొనుగోలు చేసే ఇది మంచి అవకాశం అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Cars – హ్యుందాయ్ ధరల తగ్గింపులు (సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి):
- టక్సన్ : రూ.2,40,303
- వెన్యూ : రూ.1,23,659
- వెన్యూ N లైన్ : రూ.1,19,390
- ఐ20 N లైన్ : రూ.1,08,116
- ఐ20 : రూ.98,053
- ఎక్స్టర్ : రూ.89,209
- ఆరా : రూ.78,465
- గ్రాండ్ i10 నియోస్ : రూ.73,808
- క్రెటా : రూ.72,145
- క్రెటా N లైన్ : రూ.71,762
- ఆల్కజార్ : రూ.75,376
- వెర్నా : రూ.60,640
టాటా మోటార్స్ రాయితీలు:
- నెక్సాన్ : రూ.1,55,000 వరకు
- ఆల్ట్రోజ్ : రూ.1,10,000
- సఫారి : రూ.1,45,000
- హారియర్ : రూ.1,40,000
- పంచ్ : రూ.85,000
- టిగోర్ : రూ.80,000
- టియాగో : రూ.75,000
- కర్వ్ : రూ.65,000
మహీంద్రా ధరల తగ్గింపులు:
- ఎక్స్‌యూవీ3ఎక్స్‌ఓ డీజిల్ : రూ.1,56,000
- థార్ : రూ.1,00,000 పైగా
- స్కార్పియో-ఎన్ : రూ.1,45,000
- ఎక్స్‌యూవీ700 : రూ.1,43,000
- రెనాల్ట్ మోడళ్లు:
- కైగర్ : రూ.96,395
- ట్రైబర్ : రూ.53,695
- క్విడ్ : రూ.40,095–57,000 (వేరియంట్‌పై ఆధారపడి)
టయోటా భారీ తగ్గింపులు:
- ఫార్చ్యూనర్ : రూ.3,49,000 వరకు
- లెజెండర్ : రూ.3,34,000
- హైలక్స్ : రూ.2,52,000
- వెల్‌ఫైర్ : రూ.2,78,000
- ఇన్నోవా క్రిస్టా : రూ.1,80,000
- ఇన్నోవా హైక్రాస్ : రూ.1,15,000
- కామ్‌రి : రూ.1,01,000
- అర్బన్ క్రూయిజర్ హైరైడర్ : రూ.65,400
- గ్లాంజా : రూ.85,300
మొత్తానికి, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని వాహన సంస్థలు ఇచ్చిన ఈ భారీ రాయితీలు వినియోగదారులకు ఆకర్షణీయమైన అవకాశాన్ని అందిస్తున్నాయి. తక్కువ ధరలో తమ కలల కారును సొంతం చేసుకోవడానికి ఇది సరైన సమయం కావొచ్చని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : IT Sector Shocking – Trump Tarrifs : ఐటీ రంగంలో ఆందోళన పై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి



















