Hal : ఢిల్లీ -అమెరికాతో భారత్ 1 బిలియన్ విలువైన జెట్ ఇంజిన్ ఒప్పందం చేసుకునేందుకు సిద్దమైంది. ప్రముఖ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇప్పటికే భారత వైమానిక దళం ఆర్డర్ చేసిన ప్రారంభ 83 ఎల్సీఏ ఐఏ ఫైటర్ జెటల్ కోసం 99 GE-404 ఇంజిన్‌ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. స్వదేశీ యుద్ధ జెట్‌ల కోసం 113 అదనపు GE-404 ఇంజిన్‌లను సరఫరా చేయడానికి భారతదేశం అమెరికన్ సంస్థ GEతో దాదాపు 1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకం చేయడానికి దగ్గరగా ఉంది. ఫైటర్ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం రూ. 62,000 కోట్ల ఒప్పందాన్ని ఆమోదించిన వెంటనే అమెరికాతో డీల్ కుదర్చుకోనుంది.
Hal Signs Big Deal
ఈ 113 ఇంజన్లు దానికి అదనంగా ఉంటాయి. మెత్తం హెచ్ఏల్ వద్ద 232 ఉన్నాయి. GE నిబద్ధతలను నెరవేర్చడానికి నెలకు రెండు ఇంజిన్లను సరఫరా చేసే అవకాశం ఉంది. HAL 2029-30 నాటికి మొదటి 83 విమానాలను, 2033-34 నాటికి తదుపరి 97 విమానాలను అందించాలని యోచిస్తోంది. సమాంతరంగా, హచ్ఏఎల్ 80 శాతం సాంకేతిక బదిలీతో 200 GE-414 ఇంజిన్లను కొనుగోలు చేయడానికి ప్రత్యేక ఒప్పందం కోసం GEతో చర్చలు జరుపుతోంది. ఇది LCA మార్క్ 2 , అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ కు శక్తినిస్తుంది. దాదాపు యుఎస్ 1.5 బిలియన్ల విలువైన ఈ ఒప్పందం రాబోయే నెలల్లో సంతకం చేయబడుతుందని భావిస్తున్నారు.
Also Read : Wickremesinghe Granted Bill Sensational : విక్రమసింఘేకు బెయిల్ మంజూరు
















