Kandula Durgesh : తూర్పు గోదావరి జిల్లా – కూటమి పాలనలో సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతోందన్నారు మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. 59 మందికి రూ.29.72 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 294 మందికి రూ.2.44 కోట్ల లబ్ధి చేకూర్చామని చెప్పారు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందన్నారు. పారదర్శక విధానంలో, సంతృప్త స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు, అన్నదాత సుఖీభవతో రైతాంగం సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు కందుల దుర్గేష్ (Kandula Durgesh). ఈనెల 24 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు.
Minister Kandula Durgesh Key Updates
నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన 59 మందికి రూ.29,72,186 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో సీఎం సహాయనిధి నుండి లబ్ధి జరిగిన దాఖలాలు లేవన్నారు. ప్రజలకు ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడానికి వైసీపీకి మనసెలా వస్తుందని ప్రశ్నించారు. వైసీపీకి ప్రజల మద్దతు లేకపోయినా, ప్రతిపక్షానికి సరిపడా శాసన సభ్యులు లేకున్నా అవాకులు చవాకులు పేలడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పెద్దఎత్తున దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి దుర్గేష్ ఖండించారు. కుల, మత, పార్టీ, ప్రాంత, వర్గాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శక విధానంలో సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఒకవేళ పొరపాటున అర్హులెవరికైనా పెన్షన్ తొలగిస్తే మళ్లీ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విషయంలో అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. కొందరు ఎలాంటి వైకల్యం లేకుండా అన్ని విధాలా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండికూడా పెన్షన్ పొందుతున్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. వారికి చెక్ పెడతామన్నారు.
Also Read : YS Sharmila Fired on AP Govt : రైతుల గోస పట్టని సర్కార్ : షర్మిల
















