Macron : న్యూఢిల్లీ – అమెరికా భారత్ పై సుంకాల విధింపు చర్చనీయంశంగా మారిన తరుణంలో ఫ్రెంచ్ దేశ అధ్యక్షుడు మాక్రాన్ (Macron) ఉన్నట్టుండి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేయడం ఆసక్తిని కలిగించింది. ఇదిలా ఉండగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో పాటు వచ్చిన యూరోపియన్ నాయకులలో మాక్రాన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదాల శాంతియుత పరిష్కారం, శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి భారతదేశం సంపూర్ణ మద్దతు ఇస్తుందని మోక్రాన్ కు తెలిపారు.
Emmanuel Macron Call to Modi
ఉక్రెయిన్ , పశ్చిమాసియా ప్రాంతంలో వివాదాల శాంతియుత పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై నాయకులు అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితులపై కూడా ఈ ఇద్దరు నేతలు చర్చించారు.
వాణిజ్యం, రక్షణ, పౌర అణు సహకారం, సాంకేతికత, శక్తి రంగాలతో సహా ద్వైపాక్షిక సహకార ఎజెండాలో పురోగతిని ఇద్దరు నాయకులు సమీక్షించారని పేర్కొంది. భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ముందస్తుగా ముగించడానికి అధ్యక్షుడు మాక్రాన్ మద్దతు తెలిపారన్నారు. భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించడం జరిగిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ.
Also Read : Heavy Rains Sensational : కుండ పోత వర్షం గోదావరి ఉగ్రరూపం


















