Trivikram Srinivas : ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకుడు ఆర్. నారాయణ మూర్తిని ప్రశంసలతో ముంచెత్తారు. తను తాజాగా యూనివర్శిటీ పేపర్ లీక్ పేరుతో సినిమా తీశాడు. పూర్తిగా విద్యార్థులకు సంబంధించిన కథ. ఈ సందర్భంగా స్పందించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉందన్నారు. మనకు తెలియకుండానే పిల్లల మీద ఎంతో ఒత్తిడి తీసుకు వస్తున్నామన్నారు. దీనినే తెర మీద అద్బుతంగా చెప్పే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ప్రసాద్ ల్యాబ్ లో తను చూశారు దర్శకుడు నారాయణమూర్తితో కలిసి. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Trivikram Srinivas Interesting Comments on R Narayana Murthy
తాము ఎలాగో సినిమాలు చేస్తామని కానీ మూర్తన్న లాగా సినిమాలు తీయడం చేత కాదన్నారు. ఆయన లాగా బతకడం కూడా సాధ్యం కాదన్నారు దర్శకుడు త్రివిక్రమ్. నారాయణమూర్తిని వన్ మ్యాన్ ఆర్మీ అంటూ ప్రశంసించారు. ఇప్పుడున్న దర్శకులలో అత్యంత నిబద్ధత కలిగిన డైరెక్టర్ అంటూ కొనియాడారు. విద్యా విధానం, నిరుద్యోగం, ఫీజులు , తదితర సమస్యలను బలంగా చూపించడం తనను ఆకట్టుకుందన్నారు. తను ముందు నుంచీ నమ్ముకున్న సిద్దాంతం కోసం సినిమాలు తీస్తూ వచ్చారని , ఇలా తీయడం ఇప్పట్లో , ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. భీమవరంలో ఉన్నప్పటి నుంచీ తనకు నారాయణ మూర్తి అభిమానమన్నారు.
కాగా రాజీ పడకుండా బతకడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుందన్నారు. చాలా సార్లు, చాలా సమయాల్లో జీవితంలోనూ, సినిమా తీయడంలోనూ రాజీ పడ్డానని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తనను చూస్తే జెలసీ ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : Hero Darshan – Supreme Court : కన్నడ హీరో దర్శన్‌ను అరెస్ట్ చేయాల్సిందే


















