Anitha Vangalapudi : అమరావతి – అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైంది ఏపి ప్రభుత్వం. కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష చేపట్టారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి స్వయంగా పరిశీలించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్ష ప్రభావ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు మంత్రి. పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాలు నేపధ్యంలో విపత్తుల సంస్థ కార్యలయం నుంచి కోస్తా జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ లైన్ డిపార్టమెంట్ అధికారులతో ఆరా తీశారు వంగలపూడి అనిత (Anitha Vangalapudi). ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి, డైరెక్టర్ ప్రఖర్ జైన్, ఎస్డీఆర్ఎఫ్ ఐజి రాజకుమారి, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్, ఐఎండి అమరావతి డైరెక్టర్ స్టెల్లా, ఎపిఎస్డీఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, అధికారులు పాల్గొన్నారు.
AP Home Minister Anitha Vangalapudi Key Comments
అల్పపీడనం రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉందని దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర, మధ్యకోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ వివరాలు స్వయంగా పరిశీలించారు. ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. జిల్లాల్లోను కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అధికారులు వర్ష ప్రభావ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
Also Read : Supreme Court Shocking : కోదండరాం, అలీ ఖాన్ ఎమ్మెల్సీల రద్దు

















